కరోనా వ్యాధి ఫ్లూ లాంటి లక్షణాలే చూపినప్పటికీ దీని విస్తరణ, వ్యాప్తి మాత్రం చాలా ఆందోళనకరమని వైద్యులంటున్నారు. హైదరాబాద్ మసబ్ ట్యాంకులోని సమాచార భవన్లో కరోనాపై అవగాహన కార్యక్రమంలో వైద్యులు పలు సూచనలు చేశారు. 80 శాతం మందిలో వ్యాధి సోకినా.. ప్రాణాపాయం లేకుండా బయటపడొచ్చన్నారు. అలా అని వైరస్ పట్ల నిర్లక్ష్యం తగదన్నారు.
మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి: వైద్యులు
లాక్డౌన్ సడలింపులు, ఎత్తివేత తర్వాత ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతను జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే పరీక్షలు చేయించుకోవాలన్నారు
మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి: వైద్యులు
లాక్డౌన్ సడలింపులు, ఎత్తివేసిన తర్వాత.. ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని.. భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతను జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవసరమైతే టెలిమెడిసిన్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలేమైనా ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు.
ఇవీ చూడండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!