తెలంగాణ

telangana

By

Published : Jun 2, 2021, 11:15 AM IST

ETV Bharat / state

గీతం వర్సిటీలో మరో ఇద్దరికి డాక్టరేట్​లు

హైదరాబాద్​ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు డాక్టరేట్ లభించింది. విశ్వవిద్యాలయం స్కాలర్లు హిమబిందు, జమాల్​లు సమర్పించిన సిద్ధాంత వ్యాసాలతో పీహెచ్​డీ పట్టాకు అర్హత సాధించారని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మంజునాథారి తెలిపారు. వారికి అభినందనలు తెలియజేశారు.

doctorate, geetam university
విద్యార్థులకు డాక్టరేట్​లు, గీతం యూనివర్శిటీ

హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలోని ఇద్దరు విద్యార్థులు హిమబిందు, జమాల్​లకు డాక్టరేట్ లభించింది. వారి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహిస్తున్న గీతమ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఉన్న విశ్వవిద్యాలయం స్కాలర్లు హిమబిందు, జమాల్​లు సమర్పించిన సిద్ధాంత వ్యాసాలతో పీహెచ్​డీ పట్టాకు అర్హత సాధించారని మంజునాథచారి తెలిపారు.

సహజ లక్షణాల సంగ్రహణ, వర్గీకరణ పద్ధతులను ఉపయోగించి ముఖాన్ని గుర్తించడంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని హిమబిందు సమర్పించారని, ముఖ గుర్తింపు వ్యవస్థ మూడు విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా లక్ష్యాలను సాధించినట్టు ఆయన తెలిపారు. మొదటి విధానంలో కేఏఎఫ్​టీని ఉపయోగించి ముఖాన్ని గుర్తించడం, వర్గీకరణ చేయడానికి కెర్నల్ ఆధారిత గోళాకార ఏఎం వర్గీకరణను ప్రతిపాదించారన్నారు. రెండో విధానంలో ఎం-కో- హాగ్ పద్ధతిలో ముఖ లక్షణాల సంగ్రహణ, వర్గీకరణ కోసం, న్యూరల్ నెట్​వర్క్, మసక వ్యవస్థ కలయిక సంభావ్య న్యూరో-ఫజి వ్యవస్థను రూపొందించడానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. మూడో విధానంలో వర్గీకరణ కోసం ఈఎమ్ఎఫ్వో ఆధారిత డీప్ బిలీఫ్ నెట్​వర్క్​ను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి విధానం పనితీరు ప్రయోగాత్మకంగా విశ్లేషించడంతో పాటు సీవీఎస్ ఫేస్ డేటాబేస్ ఉపయోగించి ఇప్పటికే ఉన్న ఇతర విజయవంతమైన పద్ధతులతో పోల్చి, నియంత్రిత వాతావరణంలో మంచిఫలితాలను ఇస్తుందని నిరూపించినట్టు డాక్టర్ మంజునాథాచారి తెలియజేశారు.

టెస్ట్​ ఫర్ క్లాక్ విధానంలో కనీస విద్యుత్ వినియోగ జనరేటర్లను జమాల్ రూపొందించినట్లు వెల్లడించారు. వాటి నిర్వహణపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారని తెలిపారు. బీఏఎస్టీ అమలు కోసం టీపీఎస్ పద్ధతిని ఉపయోగించి తక్కువ శక్తి టీపీజీగా చిత్రీకరించి, కనీస విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. విభిన్న రకాలైన ఎంఎస్ఎసీ రకాల నిర్మాణాల వాడకంపై దృష్టి సారించామన్నారు. పరీక్ష నమూనా ఎంఏసీ వెక్టర్లను ఉత్పత్తి చేస్తోందని వివరించారు. మొత్తంమీద బీఐఏయే నమూనాల సమర్థత, నాణ్యత, ప్రక్రియను మెరుగుపరిచే దిశగా వనరులను సముచితంగా ఉపయోగించడంతో పాటు, వాటిని మరింతగా సమర్థంగా వినియోగించే విధానాలను సూచించినట్టు డాక్టర్ మంజునాథాచారి తెలిపారు.

వీరిద్దరూ పీహెచ్​డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి:KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్​ నివాళి

ABOUT THE AUTHOR

...view details