జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించకుండా... తప్పించుకునేందుకే ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకుంటున్నారని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ సురేష్‌రెడ్డి తెలిపారు. బలవన్మరణానికి పాల్పడ్డవారిలో.. 15 నుంచి 39 ఏళ్ల వారే ఎక్కువ ఉంటున్నారని పేర్కొన్నారు. జీవితంలో అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు... ప్రతి ఒక్కరూ మానసికంగా ధృడంగా మారాలని సూచించారు. మానసికంగా కుంగిపోయినవారిని గుర్తించి... కుటుంబసభ్యులు, స్నేహితులు వారికి ధైర్యం అందించాలంటున్నారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా... మానసిక నిపుణుడు డాక్టర్ సురేష్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
'కష్టాలను అధిగమించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు' - ఆత్మహత్యల నివారణపై వైద్యుల సలహాలు
పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఉరితాడుకు వేలాడే విద్యార్థిని. ప్రేమించిన అమ్మాయి కాదన్నదని పురుగుల మందు తాగే యువకుడు. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఒకటేమిటి జీవితంలో ఏ సమస్య ఎదురైన బయటపడే సులభమార్గంగా ఆత్మహత్యలను భావించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కన్నా వాళ్లకు కడుపుకోత మిగిల్చి.. నమ్మిన వాళ్లను నట్టేట ముంచి అనంత లోకాలకు అర్ధాంతరంగా వెళ్తున్నారు.
'కష్టాలను అధిగమించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు'