ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన వైద్యుడు... సుధాకర్ ఇవాళ పోర్టు ఆసుపత్రి వద్ద నిరసకు దిగాడు. అర్ధనగ్నంగా రోడ్డుపై ఆందోళన చేస్తున్న వైద్యుడిని పోలీసులు వారించిన వినకపోయేసరికి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ మెడను లాఠీతో వంచి, రెండు చేతులను కట్టేసి, కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
విశాఖలో దారుణం.. వైద్యుడిని కట్టేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు - ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పోర్టు ఆస్పత్రి వద్ద వైద్యుడు సుధాకర్ నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డుపై అర్ధనగ్నంగా ఆందోళన చేస్తుండగా... ట్రాఫిక్ పోలీసులు ఆయన్ని తాళ్లతో కట్టి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్థీషియన్ వైద్యుడిగా సుధాకర్ పనిచేశాడు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని... కనీసం మాస్కులు, పీపీఈ, కిట్లు లేవంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కారణంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించినప్పటి నుంచి సుధాకర్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి:రెండో రోజు కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ