హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో వైద్యుడి కిడ్నాప్ కలకలం రేపింది. హిమాయత్‌సాగర్ దర్గా సమీపంలో ఉన్న దంత వైద్యుడు బెహజాట్ హుస్సేన్‌ను బురఖాలో వచ్చిన వ్యక్తులు అతడి కారులోనే తీసుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన వైద్యుడి కుటుంబసభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బురఖాలో వచ్చి.. రాజేంద్రనగర్‌లో వైద్యుడి కిడ్నాప్ - rajendranagar doctor kidnap
రాజేంద్రనగర్‌లో వైద్యుడి కిడ్నాప్ కలకలం రేపింది. దుండగులు బురఖా ధరించి వైద్యుడిని చేసి అతని కారులోనే తీసుకెళ్లారు. డాక్టర్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బురఖాలో వచ్చి.. రాజేంద్రనగర్‌లో వైద్యుడి కిడ్నాప్
వైద్యుడి కారు నంబర్ ఏపీ 9 వై 0031గా కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలా? వ్యాపార లావాదేవీల కారణంగా వైద్యుడిని తీసుకెళ్లారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కారు వెళ్లిన దారిలో సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఇవీ చూడండి:విశ్రాంత అదనపు ఎస్పీపై కేసు నమోదు