హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో(osmania hospital) వైద్యురాలికి గాయాలయ్యాయి. ఫ్యాన్ ఊడిపడి వైద్యురాలి తలకు గాయమైంది. ఔట్‌పేషెంట్ విభాగంలో విధుల్లో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఫ్యాన్ పాతది కావడం వల్లే ఇలా అకస్మాత్తుగా ఊడిపడిందని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు. ఆస్పత్రిలో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
osmania hospital: ఉస్మానియా ఆస్పత్రిలో ఊడిపడిన ఫ్యాన్.. వైద్యురాలి తలకి గాయం - తెలంగాణ వార్తలు
ఉస్మానియా ఆస్పత్రిలో(osmania hospital) దుర్ఘటన జరిగింది. ఫ్యాన్ ఊడిపడి వైద్యురాలికి గాయాలయ్యాయి. విధుల్లో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఉస్మానియా ఆస్పత్రిలో ఊడిపడిన ఫ్యాన్, వైద్యురాలి తలకి గాయం
నిత్యం వందల మంది వచ్చే ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాతవైన ఫ్యాన్లు, ఇతర సామాగ్రిని తొలగించి... కొత్తవి సమకూర్చాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో విధుల్లో ఉండగానే వైద్యురాలిపై ఫ్యాన్ ఊడిపడడంతో కలకలం సృష్టించింది. ఈ ఘటనతో ఆస్పత్రిలోని సిబ్బంది, రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:Viral Video: దారుణం: ట్యాబ్లెట్ ఇవ్వమని.. మెడికల్ షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం