రాష్ట్ర వ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. 46 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులు, మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. యూవీ కిరణాలు అతి ప్రమాదకరమైనవని... వీటి వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దిలీప్ గుడే తెలిపారు. డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండేందుకు ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలంటున్న దిలీప్ గుడేతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
'ఉష్ణోగ్రతలు అధికమైతే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి'
అధిక ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతాయని... ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రమంతటా భానుడు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
'ఉష్ణోగ్రతలు అధికమైతే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి'