తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు - హైదరాాబాద్‌లో సైబర్‌ క్రైం నేరాలు

నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు అధికారి పేరుతో ఓ వైద్యునికి ఫోన్‌ చేసి రూ. 50వేలు కాజేశారు. బాధిత డాక్టర్‌ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

doctor cheated by cyber crime thieves in hyderabad
నగరంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు

By

Published : Apr 23, 2020, 11:14 AM IST

భాగ్యనగర్‌లో సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఓ డాక్టర్‌కు బ్యాంకు అధికారినని నమ్మబలికి రూ. 50 వేలు దోచేశారు. బ్యాంక్ అధికారి పేరిట వైద్యుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంకు సంబంధింత యూప్‌ను వాడాలని సూచించారు. ఆన్‌లైన్‌ నేరగాళ్ల మాటలు నమ్మిన ఆ వైద్యుడు యాప్ డౌన్లోడ్ చేశాడు.

అంతే ఇక కొంత సమయం తర్వాత అకౌంట్ నుంచి 50వేల రూపాయలు డ్రా చేసినట్లు సంక్షిప్త సందేశం వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న బాధిత డాక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:వైద్యులపై దాడిచేస్తే ఇక ఏడేళ్ల జైలు.. కేంద్రం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details