ETV Bharat / state
భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలి : కిషన్‌రెడ్డి - kishan reddy latest news today
లాక్డౌన్ కొనసాగుతోన్న కారణంగా ఈరోజు నుంచి పలురకాల పనులకు కేంద్రం సడలింపు ఇచ్చింది. కేంద్ర కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో నడవాలని నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కూలీలు, కార్మికుల ఒత్తిడి దృష్ట్యా కొన్ని మినహాయింపులు ఇచ్చామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ఆ అంశాల గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలి : కిషన్‌రెడ్డి
By
Published : Apr 20, 2020, 11:58 AM IST
| Updated : Apr 20, 2020, 2:26 PM IST
భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలి : కిషన్‌రెడ్డి
ప్రశ్న: ఈరోజు నుంచి ఏ రకమైన సడలింపులు అమల్లోకి వస్తున్నాయి, కేంద్రం రాష్ట్రాలకు ఎటువంటి సూచనలు చేస్తుంది?
సమాధానం : కంటైన్మెంట్ ప్రాంతాలు, రెడ్ జోన్లలో సడలింపులు లేవనికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో 100 శాతం లాక్డౌన్ అమలు చేయాలన్నారు.
ప్రశ్న: పలు రకాలైన సడలింపులు కాకుండా కొన్ని రాష్ట్రాలు అదనంగా అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిసింది వాటిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ?
సమాధానం :ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్లతో ప్రధానమంత్రి గారు మాట్లాడారు.
ప్రశ్న: ఈ రోజు కొన్ని సంస్థలకు అవకాశం ఇచ్చారా, లేదా రాష్ట్రాలు నిత్యావసరాలు పంపిణీ చేయడంలో ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా ?
సమాధానం :మనం ఆహారం పంపిణీ చేయడంలో భౌతిక దూరం పాటిస్తూ పంపిణీ చేయాలి.
ప్రశ్న: ఈరోజు దేశం మొత్తం మీద ఏఏ శాఖలు పని చేస్తున్నాయి, ఎవరికి అవకాశం కల్పిస్తున్నారు?
సమాధానం :కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు, ఇతర 30 శాతం సిబ్బందితో నడవాలని నిర్ణయం తీసుకున్నాం.
ప్రశ్న: నరేగాకు సంబంధించి, వలస కూలీలకు ఏఏ పనులకు అవకాశం కల్పిస్తున్నారు?
సమాధానం : పంట కోతలు ఉన్నప్పుడు నరేగా పనులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. వ్యవసాయ కార్మికులను పంట కోతలకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ప్రశ్న: వలస కూలీల విషయంలో రాష్ట్రాలు దాటొద్దని కేంద్రం ఆదేశిలిచ్చింది. వారి విషయంలో మీరు ఏం చర్యలు తీసుకున్నారు?
సమాధానం :ఏ రాష్ట్రాల పరిధిలో ఉన్న వలస కార్మికులు ఆ జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకుని పనులు చేపించుకోవాల్సన బాధ్యత ఆ కంపెనీలదే.
Last Updated : Apr 20, 2020, 2:26 PM IST