కరోనా వ్యాప్తి కారణంగా పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయుల్లో భయాందోళ ఉందని.... దీనినిపై విద్యాశాఖ దృష్టి సారించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్నారని... వారందరూ సామూహికంగా కూర్చోవడం వలన దాదాపు 300 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా బారీన పడినట్లు తెలిపారు.
'ఉపాధ్యాయులను కరోనా బాధితులుగా చేయొద్దు' - Telangana teachers latest news
కరోనా వైరస్ కారణంగా సుదీర్ఘ కాలం అనంతరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయులు సామూహికంగా కూర్చోవడం వలన కొవిడ్ బారీన పడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. వారిని మహమ్మారి నుంచి కాపాడాలని కోరారు.
!['ఉపాధ్యాయులను కరోనా బాధితులుగా చేయొద్దు' Do not make teachers corona victims Appel to Education Minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8651126-893-8651126-1599041569466.jpg)
'ఉపాధ్యాయులను కరోనా బాధితులుగా చేయొద్దు'
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభించినట్లు వారు తెలిపారు. డిజిటల్ తరగతుల నిర్వహణపై మంత్రి ఉపాధ్యాయులను అభినందించినట్లు టీఎస్‌యూటీఎఫ్ కార్యదర్శి చావరవి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని మంత్రి చెప్పినట్లు వారు వివరించారు.
'ఉపాధ్యాయులను కరోనా బాధితులుగా చేయొద్దు'
ఇవీచూడండి:రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్‌రెడ్డి