పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ), దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)ను ఉపసంహరించాలని కోరుతూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై పలు సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఇప్పటికే ఎన్ఆర్సీ అసోంలో చాలా అల్లకల్లోలం సృష్టించిందని నిరసన కారులు ఆందోళన వ్యక్తం చేశారు. 19 లక్షల మందిని భారత పౌరులు కారని జైళ్లకు పంపడం జరిగిందన్నారు. అందులో అనేక మంది పేదలున్నారని వాపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలు చేయొద్దు - Do not implement NRC in Telugu states
హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద సీఏబీ, ఎన్ఆర్సీ తరఫున ఏర్పడిన పౌరవేదిక తరపున అనేక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలు చేయొద్దు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. పౌరసత్వానికి మతాన్ని ప్రాతిపదికగా చేర్చడాన్ని వారు ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసులు, గృహకార్మికులు, మైనార్టీలు, పేదల కోసం పోరాడుతున్న పలు సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలు చేయొద్దు
ఇదీ చూడండి : ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు: పోలీస్ అకాడమీకి 'దిశ' తండ్రి, సోదరి