తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్​కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ - జగన్ కేసులో సీబీఐ కౌంటర్​

అక్రమాస్తుల కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ... ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేయగా... తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా పడింది.

జగన్​కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ
telangana high court adjourned ap cm ys jagan petition to April 6th

By

Published : Feb 12, 2020, 7:06 PM IST

అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్‌ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలుపుతూ... కౌంటర్‌ దాఖలు చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ అధికారులు కౌంటర్‌లో పేర్కొన్నారు. కౌంటర్‌ దాఖలు కావటం వల్ల తదుపరి విచారణను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.

సీఎం హోదాలో అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉన్నందువల్ల ప్రతివారం విచారణకు రావడానికి ఇబ్బందులున్నాయని దాఖలు చేసిన పిటిషన్​లో జగన్​ పేర్కొన్నారు. సీబీఐ కోర్టులో 11 ఛార్జిషీట్లపై ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్నందున తన బదులు న్యాయవాది అశోక్‌రెడ్డి హాజరయ్యేలా అనుమతివ్వాలని సీఎం జగన్‌ కోరారు. తన వ్యక్తిగత హాజరు తప్పనిసరని కోర్టు ఆదేశించినప్పుడు హాజరుకు సిద్ధమని చెప్పినా.. కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపుపై గతంలో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించగా... ఏపీ సీఎం జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూండడి:ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

ABOUT THE AUTHOR

...view details