రెవెన్యూ శాఖలను రద్దు చేసి ఇతర శాఖలకు బదిలీ చేయాలనే ఆలోచనను మానుకోవాలని వీఆర్వో, వీఆర్ఏల ప్రతినిధులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రజలు, ఉద్యోగులకు మంచి చేసేందుకు నూతన చట్టాన్ని తీసుకొస్తే తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఐకాసగా ఏర్పడి సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో ఈ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని వీఆర్వో సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన తమను గత ప్రభుత్వాల తరహాలోనే ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. ఏ శాఖలోనూ విలీనం చేయకుండా.. మరింత బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలు పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లిన ఘనత తమదేనని చెప్పారు. ఈ నెల 29వ తేదీన జరిగే వీఆర్వో, వీఆర్ఏల ఆత్మగౌరవ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
"రెవెన్యూ శాఖ రద్దు ఆలోచన విరమించుకోవాలి" - revenue department
రెవెన్యూ శాఖలను రద్దు చేసి ఇతర శాఖలకు బదిలీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని వీఆర్వో సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమర్‌కు వినతిపత్రం అందజేశారు.
గత ప్రభుత్వాల మాదిరి ఇబ్బందులకు గురిచేయకండి