తెలంగాణ

telangana

ETV Bharat / state

సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయొద్దు: హైకోర్టు - telangana varthalu

highcourt
సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయొద్దు: హైకోర్టు

By

Published : Apr 28, 2021, 2:21 PM IST

Updated : Apr 28, 2021, 3:17 PM IST

14:17 April 28

సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయొద్దు: హైకోర్టు

  ఇళ్ల స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అంశం... ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​లపై దాఖలైన పిటిషన్లన్నింటిపైనా విచారణను హైకోర్టు ముగించింది. అనధికార లేఅవుట్‌లు, భవనాల క్రమబద్ధీకరణపై విచారణ జరపగా.. ఎల్​ఆర్​ఎస్​పై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బలవంతంగా అమలుకు చర్యలు చేపట్టవొద్దని ఆదేశించిన హైకోర్టు... సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్​ఆర్​ఎస్​ అమలు చేయొద్దని స్పష్టం చేసింది. 

  సుప్రీంలో తేలే వరకు బీఆర్​ఎస్​ దరఖాస్తులపైనా తుదినిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపగా.. తాము విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​పై  దాఖలైన పిటిషన్లన్నింటి విచారణను ముగించింది.

ఇదీ చదవండి: 'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

Last Updated : Apr 28, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details