తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్

GHMC Commissioner
వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్

By

Published : Dec 7, 2020, 9:54 AM IST

Updated : Dec 7, 2020, 12:23 PM IST

09:50 December 07

వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్​లో వరద బాధితులెవరూ మీ-సేవ కేంద్రాలకు రావల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 7 నుంచి వరద సాయం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ సమీక్షించారు. 

క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించి వరద సాయం అందని వారి వివరాలు సేకరిస్తాయన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ సంఖ్య ధ్రువీకరించుకున్న తర్వాత బాధితుల ఖాతాల్లోకి నగదు జమవుతుందని స్పష్టం చేశారు. బాధితులెవరూ మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగొద్దని లోకేశ్​కుమార్​ సూచించారు. 

ఇవీచూడండి:వరద సాయం అందించపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తాం: కోమటిరెడ్డి

Last Updated : Dec 7, 2020, 12:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details