ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్ల కోసం ఏ రూపంలోనూ ఆధార్ వివరాలు సేకరించొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ఆధార్ వివరాలను ఏరూపంలోనూ సేకరించవద్దు: హైకోర్టు
15:51 December 16
ఆధార్ వివరాలను ఏరూపంలోనూ సేకరించవద్దు: హైకోర్టు
హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ దరఖాస్తు కోసం.. ఆధార్, కులం వివరాలు అడుగుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలను అడగబోమని అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చారని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. ఓ వైపు హామీ ఇచ్చి.. మరోవైపు పరోక్షంగా వివరాలు సేకరించడం తగదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హామీని లిఖితపూర్వకంగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ధరణి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా పునఃపరిశీలిస్తోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ధరణిపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను రేపటి వరకు పొడిగించింది.
ఇవీచూడండి:'విచక్షణాధికారాలకు తావు లేకుండా.. పారదర్శకంగా, సులభంగా..'