తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించొద్దు'

చెరువుల్లోని ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌ చెరువులో అక్రమ నిర్మాణాలు నిర్మించడాన్ని సవాలు చేస్తూ రాజీవ్‌ ఖండేవాల్‌, రవిగౌడ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించింది.

'ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించొద్దు'
'ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించొద్దు'

By

Published : Mar 19, 2021, 5:18 AM IST

హైదరాబాద్‌ మహానగరంలోని అమీన్‌పూర్‌ చెరువుతో పాటు ఇతర అన్ని చెరువుల్లోని ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌టీఎస్‌ ప్రాంతాల్లో నిర్మాణాలను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. అమీన్‌పూర్‌ చెరువులో అక్రమ నిర్మాణాలు నిర్మించడాన్ని సవాలు చేస్తూ రాజీవ్‌ ఖండేవాల్‌, రవిగౌడ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

చెరువు సమీపంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవద్దని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేసినట్టు తెలిపింది. ఈ చెరువు అంతర్జాతీయంగా పేరు పొందిందని ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలను అడ్డుకోవడానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం స్పందిస్తూ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం ప్రభుత్వం బాధ్యత అని, దీనికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రశ్నించింది.

తదుపరి విచారణను కోర్టు జులై 27కు వాయిదా వేసింది. అప్పటివరకు చెరువుల్లో ఎఫ్‌టీఎస్‌ ప్రాంతాల్లో నిర్మాణాలను అనుమతించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details