రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఎక్కడా ప్రాణవాయువుకు కొరత లేదని వైద్యవిద్య సంచాలకులు రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో డీఎంఈ వివరణ ఇచ్చారు.
కొవిడ్ సోకిన వారందరికీ బ్లాక్ ఫంగస్ రాదు: రమేశ్‌రెడ్డి - black fungus cases in gandhi hospital
కొవిడ్ సోకిన వారందరికీ బ్లాక్ ఫంగస్ రాదని వైద్యవిద్య సంచాలకులు రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో కేవలం మూడు మాత్రమే బ్లాక్ ఫంగస్ కేసులున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో డీఎంఈ వివరణ ఇచ్చారు.
బ్లాక్ ఫంగస్‌పై డీఎంఈ స్పందన
కొవిడ్ సోకిన వారందరికీ బ్లాక్ ఫంగస్ రాదని తేల్చిచెప్పారు. గాంధీ ఆస్పత్రిలో కేవలం మూడు మాత్రమే బ్లాక్ ఫంగస్ కేసులున్నాయని తెలిపారు. అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. ఈ సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వానికి సహకరిస్తేనే మహమ్మారిపై విజయం సాధించొచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్: డీహెచ్