తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం జగన్ ఇంత అవినీతి పరుడని అనుకోలేదు: డీఎల్ - andhra pradesh news

DL Ravindra Comments on CM: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నాడని ఆశిస్తే, చాలా అవినీతికి పాల్పడుతున్నారని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఇలాంటి పాలన చూడలేదని వాపోయారు. ఇపుడు అంతా అవినీతి మయం అయిపోయిందని డీఎల్ వ్యాఖ్యానించారు.

DL Ravindra Comments on CM
DL Ravindra Comments on CM

By

Published : Dec 21, 2022, 5:55 PM IST

DL Ravindra Comments on CM: సీఎం జగన్ జన్మదినం సందర్భంగా బైజూస్ కంటెంట్​తో విద్యార్థులకు ట్యాబ్​లు ఇవ్వడం ఓ కుంభకోణమని, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ, సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇసుక, మట్టి, ఎర్రమట్టి దేన్నీ వదలకుండా స్వాహా చేస్తున్నారని, ఇవన్నీ సీఎంకు తెలిసే జరుగుతున్నాయని అన్నారు.

తాను ఇప్పటికీ వైసీపీలో ఉన్నప్పటికీ.. నేతల అరాచకాలు చూసి అసహ్యంతో పార్టీకి దూరంగా ఉంటున్నట్లు డీఎల్ తెలిపారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే, ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలల్లో టీడీపీ, జనసేన కలిస్తే బాగుంటుందన్న డీఎల్.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలతో పాటు తాను కూడా ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

"నా జీవితంలో రాజశేఖర్​రెడ్డి కుమారుడు ఇంత అవినీతి పరుడవుతాడని నేను అనుకోలేదు. ఎన్నికల ముందు సమావేశం పెడితే, అన్న నాకేం ఉంది. నాకు ఇద్దరు కుతురులే కదా, నేను అవినీతి చెయ్యను. అవినీతి చెయ్యకుండా పరిపాలన మంచిగా చేసి, మా నాయన కన్న మంచి పేరు తెచ్చుకుంటా అన్నారు. ఇప్పుడు చూస్తే పాలన అంతా అవినీతిమయంగా మారింది. " -డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి

సీఎం జగన్ ఇంత అవినీతి పరుడని అనుకోలేదు: మాజీ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details