తెలంగాణ

telangana

ETV Bharat / state

మలక్​పేటలో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించిన డీకే అరుణ - malakpet flood water areas latest news

హైదారాబాద్​ మలక్​పేట్​ పరిధిలోని మూసీ పరివాహక ముప్పు ప్రాంతాల్లో భాజపా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భాగ్యనగరానికి వరద ముప్పు వాటిల్లిందని ఆమె ఆరోపించారు.

dk aruna visited malakpet flood prone areas
మలక్​పేటలో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించిన డీకే అరుణ

By

Published : Oct 16, 2020, 5:13 PM IST

హైదరాబాద్​ సంకేశ్వర్​ బజార్,​ సింగరేణి కాలనీ, మూసీ పరివాహక ముప్పు ప్రాంతాల్లో భాజపా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. వర్షం వల్ల నీట మునిగిన బాధితులను ఆమె పరామర్శించి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మూడు రోజుల క్రితం పడిన వర్షాల తీవ్రతను పరిశీలించేందుకు ప్రజాప్రతనిధులెవరూ రాలేదని సింగరేణి కాలనీలోని ఓ అపార్ట్​మెంట్​ వాసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం వైఫల్యం వల్లే హైదరాబాద్​కు వరద ముప్పు ఏర్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

ABOUT THE AUTHOR

...view details