భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ ఎంపికయ్యారు. తనను ఎంపిక చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ, అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయమని ఆమె పేర్కొన్నారు.
మోదీ, అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపిన డీకే అరుణ
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయటం పట్ల.. డీకే అరుణ సంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఏ పదవిని ఆశించలేదని.. కేంద్ర కార్యవర్గంలో దక్కిన చోటును సిన్సియారిటీ, కరిష్మాకు గౌరవంగా భావిస్తున్నాని తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యమంటున్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి.
మోదీ, అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపిన అరుణ
వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని డీకే అరుణ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తామని వివరించారు.
ఇదీ చూడండి:సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్: అఖిలపక్షం
Last Updated : Sep 26, 2020, 10:15 PM IST