జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్నా.. దుబ్బాకలో తెరాస పరాజయం కారణంతోనే ముందుగా ఎన్నికలు జరుపుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆ పరాజయం జీహెచ్‌ఎంసీలో కూడా పునరావృతం అవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఇక్కడ కూడా అవే ఫలితాలే వస్తాయి: డీకే అరుణ - చైతన్యపురిలో పర్యటించిన డీకే అరుణ
దుబ్బాకలో తెరాస పరాజయం కారణంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు త్వరగా నిర్వహిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఇక్కడ కూడా దుబ్బాక ఫలితాలే వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక్కడ కూడా అవే ఫలితాలే వస్తాయి: డీకే అరుణ
జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్లలో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. చైతన్యపురిలో నిర్వహించిన తెలంగాణ ఆర్యవైశ్య జాతీయ సమ్మేళనానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలను కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుందని డీకే అరుణ వివరించారు.
ఇదీ చూడండి :'ఇబ్బందుల్లో ఎవరూ రాలేదు... ఓట్ల కోసమూ ఎవరు రావొద్దు'