తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయం: డీకే అరుణ - హైదరాబాద్ తాజా వార్తలు

హైదరాబాద్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. రాజ్​భవన్​కు వెళ్లి ఆమెకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

DK Aruna meets governer at Raj bhavan in hyderabad
గవర్నర్​ను కలిసిన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

By

Published : Nov 16, 2020, 7:37 PM IST

Updated : Nov 16, 2020, 7:44 PM IST

రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని ఆమె తెలిపారు.

"జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయం. ఎన్నికల్లో లబ్ధికోసమే తెరాస నాయకులు వరద బాధితులకు పదివేల ఆర్థికసాయం ప్రకటించారు. నిజమైన బాధితులకంటే తెరాస కార్యకర్తల జేబుల్లోకే డబ్బులు వెళ్లాయి. వరద బాధితుల పేరుతో రూ.550 కోట్ల ప్రజాధనాన్ని కార్యకర్తలకు దోచిపెట్టారు. ఎన్నికలప్పడు ప్రజలను మభ్యపెట్టడం తెరాసకు బాగా తెలుసు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోమనడం ఇందులో భాగమే. బాధితుల నుంచి ఆధార్, బ్యాంకు వివరాలు సేకరించి ఆకౌంట్లలో డబ్బులు ఎందుకు వేయలేదు. ఎన్నికల ముందు ప్రజలకు ఆశ కల్పించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు." -డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

ఇదీ చూడండి:రైతుల సమస్యలు పరిష్కరించే వరకు మేం పోరాడతాం: భట్టి

Last Updated : Nov 16, 2020, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details