తెలంగాణ

telangana

ETV Bharat / state

Dk Aruna: పెద్దిరెడ్డితో డీకే అరుణ సమావేశం - bjp National Vice President dk aruna

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ(dk aruna) పెద్దిరెడ్డితో పలు అంశాలపై చర్చించారు. మాజీ మంత్రి ఈటల భాజపాలోకి వస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

DK Aruna meeting with former minister peddireddy
dk aruna: మాజీ మంత్రితో డీకే అరుణ సమావేశం

By

Published : Jun 2, 2021, 6:00 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలోకి వస్తుండడం పట్లు పార్టీ నియోజకవర్గ బాధ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే బర్తరఫ్‌ చేసిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ(dk aruna) పెద్దిరెడ్డితో సమావేశమయ్యారు.

ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న పెద్దిరెడ్డిని పరామర్శించడంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దిరెడ్డికి డీకే.అరుణ సూచించారు.

ఇదీ చూడండి:ఉద్యమకారుల ఆశయాలకు భిన్నంగా తెరాస పాలన: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details