రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని భాజపా నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. డెంగీ, విషజ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. పాఠశాలలకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యాధులతో ఆసుపత్రులకు వస్తున్నవారికి మెరుగైన చికిత్సలు అందించే స్థితిలో ప్రభుత్వాసుపత్రులు లేవని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి, కేసీఆర్కు ప్రజల ఆరోగ్యంపై పట్టింపు లేదని విమర్శించారు. హెల్త్ ఎమర్జెన్సీపై సమీక్ష నిర్వహించేందుకు సీఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారింది: డీకే అరుణ - Dengue
హైదరాబాద్‌లో డెంగీ, విషజ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందన... నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని భాజపా నేత డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం రోగాల తెలంగాణగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు.
తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారింది: డీకే అరుణ