తెలంగాణ

telangana

ETV Bharat / state

203 జీవోను తక్షణం నిలిపివేయాలి: డీకే అరుణ - dk aruna conduct bjp deeksha at her home in jubilee hills

డీకే అరుణ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. కేసీఆర్​ వెంటనే ఏపీ సీఎంతో చర్చలు జరిపి 203 జీవోను నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

dk aruna conduct bjp deeksha at her home in jubilee hills, hyderabad
203 జీవోను తక్షణం నిలిపివేయాలి: డీకే అరుణ

By

Published : May 13, 2020, 2:14 PM IST

పోతిరెడ్డిపాడు అంశంపై నిరసిస్తూ... మాజీ మంత్రి డీకే అరుణ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్​ తీసుకొచ్చిన 203జీవోను తక్షణం నిలిపివేయాలని అన్నారు. నీటి కేటాయింపు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి కేటాయింపు తరలింపును కేసీఆర్​ అడ్డుకోవాలని డిమాండ్​ చేశారు. లేకపోతే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

203 జీవోను తక్షణం నిలిపివేయాలి: డీకే అరుణ

ఉమ్మడి నల్గొండ, పాలమూరు,రంగారెడ్డి జిల్లాల్లో ఏ ఒక్కరైతుకు నష్టం జరిగినా ఊరుకోం... ముఖ్యమంతి వెంటనే ఏపీ సీఎంతో చర్చలు జరిపి జీవోను నిలిపివేయాలని డిమాండ్​ చేస్తున్నాం... - డీకే అరుణ, మాజీ మంత్రి

ఇదీ చూడండి:కొత్తపేట మార్కెట్​లో ఉద్రిక్తత...భాజపా నేతపై చేయి చేసుకున్న సీఐ

ABOUT THE AUTHOR

...view details