దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌పై సిద్దిపేట పోలీసులు దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలో కార్యకర్తలను కలిసేందుకు వెళ్తున్న ఆయన్ని అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులు: డీకే అరుణ
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సిద్దిపేట పోలీసుల దాడిని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు.
దుబ్బాక ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులు: డీకే అరుణ
దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక అభ్యర్థి బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. తెరాస ప్రభుత్వ చర్యలు ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. సిద్దిపేటలో దాడులు చేసిన పోలీసులు... గజ్వేల్‌లోని సీఎం ఫాంహౌస్‌లో దాడులు నిర్వహించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.