భాజపా జాతీయ కమిటీని భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలోకి రాష్ట్రం నుంచి డీకే అరుణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరిలకు స్థానం కల్పించారు.
భాజపా జాతీయ కార్యవర్గంలోకి లక్ష్మణ్, డీకే అరుణ - BJP president J.P. Nadda announced a new bjp team

bjp
16:01 September 26
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరిలను ఈ మేరకు ఎంపిక చేశారు. జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా డా.కె.లక్ష్మణ్‌లకు స్థానం లభించింది.
ప్రధాన కార్యదర్శుల జాబితాలో రామ్ మాధవ్, మురళీధర్ రావు పేర్లు కనిపించలేదు. జాతీయ అధికార ప్రతినిధుల జాబితాలో జీవీఎల్ నర్సింహారావుకు చోటు లభించలేదు.
ఇదీ చూడండి :ఆశ్రునయనాలతో అంత్యక్రియలు.. నిందితులను కఠినంగా శిక్షించాలి
Last Updated : Sep 26, 2020, 7:53 PM IST
TAGGED:
భాజపా జాతీయ కమిటీ ప్రకటన