తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఏడాది వేడుకల్లేక ఉపాధి కోల్పోయిన డీజేలు, వ్యాపారులు - Bitter experiences this year with Corona

కరోనా వల్ల ఈ ఏడాది నగర వాసులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి. వారాంతాలు, పండగ దినాల్లో ఉల్లాసంగా గడిపేవారిని గడప దాటకుండా చేసింది ఈ మహమ్మారి. వేడుకలు, విందులు, వినోదాలకు దూరంగా ఉంచింది. నుమాయిష్‌, పుస్తక ప్రదర్శనతో పాటు కొత్త సంవత్సర వేడుకలు నిలిచిపోయాయి. అదే సమయంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు.

DJs, merchants lost their jobs without celebrations in this year
వేడుకల్లేక ఉపాధి కోల్పోయిన డీజేలు, వ్యాపారులు

By

Published : Dec 29, 2020, 9:43 AM IST

తగ్గిన డీజేల హోరు:డిసెంబరు 31 రాత్రి ఈవెంట్లను పోలీసులు నిషేధించారు. ఆనందోత్సాహాల నడుమ కొత్త ఏడాదిని ఆహ్వానిద్దామని వేడుకలకు ప్రణాళికలు వేసుకున్నవారికి నిరాశే ఎదురైంది. డీజేలు, ఎలక్ట్రిక్‌, లైటింగ్‌ తదితర పనుల్లో నిమగ్నమయ్యేవారికి ఉపాధి పోయింది.

  • నగరంలో డీజేలు: 200 మంది
  • సంపాదన: రూ.3లక్షల వరకు
  • కోల్పోయిన వ్యాపారం: రూ.6 కోట్లు

నుమాయిష్‌: ఏటా నాంపల్లి వద్ద జరిగే ఎగ్జిబిషన్‌లో దేశంలోని పలు రాష్ట్రాల వ్యాపారులు స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ప్రదర్శన జరగకపోవడంతో వారంతా నిరాశ చెందారు. మార్చిలో నిర్వహణకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నారు.

  • ఏర్పాటయ్యే స్టాళ్లు: 2400
  • సందర్శకులు: 16 లక్షల మంది
  • వ్యాపారం: రూ.500 కోట్లు

పుస్తక ప్రదర్శన:హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన వాయిదా పడటంతో లక్షలాది పాఠకులు నిరాశ చెందారు. పది రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన పుస్తకాలు లభ్యమయ్యేవి. మార్చిలోనైనా అనుమతిస్తారని పాఠకులు ఆశిస్తున్నారు.

  • ఏటా ఏర్పాటయ్యే స్టాళ్లు: 350
  • సందర్శకులు: 10 లక్షల మంది
  • అమ్ముడయ్యే పుస్తకాల విలువ: రూ.3కోట్లు

కోట్లాది రూపాయల నష్టం:

ఒక్క డిసెంబరులోనే ఈవెంట్లు అధికంగా జరుగుతుంటాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మరీ ఎక్కువ. నగరంలో సుమారు 100 పబ్‌లు ఉండగా వేడుకలకు దేశీయ, విదేశీ డీజేలను పిలిపిస్తారు. ఒక్కో పబ్‌ సామర్థ్యం 300-500 వరకు ఉంటుంది. వివిధ రకాల ప్యాకేజీలతో ఆకట్టుకొనేవారు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేకు పడింది. ఈ రంగం కోట్లాది రూపాయలు నష్టపోయింది.- అరుణ్‌, ఈవెంట్స్‌ నిర్వాహకులు

ఇదీ చూడండి: కరోనా స్ట్రెయిన్ పట్ల ఆందోళన అనవసరం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details