Diwali Water Candles: దీపావళికి 'వాటర్ క్యాండిల్స్' సిద్ధం చేసుకోండిలా! - దీపావళికి నీటితో వెలిగే దీపాలు
Diwali water light lamps: దీపావళి అంటేనే మనకు మొదటిగా గుర్తోచ్చేది ఇంటి నిండా దీపాలు వెలిగించాలి.. ఆ దీపాలను అందరూ నూనెతో గానీ కొవ్వొత్తులతో గానీ వెలిగిస్తారు.. అయితే ఆ దీపాలను ప్రమిదల్లో చాలా మంది వెలిగిస్తూ ఉంటారు. ఇలా కాకుండా కొత్తగా ఏమైనా చేయాలనే ఆలోచన ఎవరి మదిల్లోనూ మెదల్లేదా.. నీటితో దీపాలు వెలిగించాలి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా.. నీటిలో ఎలా దీపం వెలుగుతుంది అనేది మీ ఆలోచన కదా అయితే ఈ దీపావళికి నీటిలో దీపాలు వెలిగిద్దామా.. అయితే మరి ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడో చేసేద్దాం.. రండీ!
నీటి దీపాలు
By
Published : Oct 24, 2022, 6:00 PM IST
Diwali special lights: దీపావళి రోజు మట్టి ప్రమిదల్లోనే చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. అదీ కాకుంటే ఇత్తడి, రాగి, ఇనుము ప్రమిదలను ఉపయోగిస్తుంటారు. అవేవీ కాకుండా నీటితోనూ దీపాలు వెలిగించొచ్చు. నీటిలో వెలుగులు ఎలా తేవాలంటే..
దీపావళి రోజు మట్టి ప్రమిదల్లోనే చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. అదీ కాకుంటే ఇత్తడి, రాగి, ఇనుము ప్రమిదలను ఉపయోగిస్తుంటారు. అవేవీ కాకుండా నీటిలోనూ దీపాలు వెలిగించొచ్చు. మరి ఈ దీపావళికి ఇంట్లో నీటి దీపాలను వెలిగించాలనుకుంటే ఇది ఫాలో అవ్వండి. దీన్ని తయారు చేయడమూ తేలికే. ఓ గాజు గ్లాసులో నీళ్లు పోసి వృథాగా ఉన్న ప్లాస్టిక్ పూలు, ఎండిపోయిన పూల రెక్కలు, రంగు రాళ్లు, పూసలను వెయ్యండి.
వాటర్ కలర్ కాకుండా వేరే కలర్ కావాలంటే ఫుడ్‌కలర్ ఎల్లో, ఆరెంజ్, గ్రీన్.. అలాగే ఉజాలా కూడా కలపొచ్చు. అందులో ఓ టీ స్పూన్ దీపాల నూనె (లేదా) వంటె నూనె పోయండి. సువాసనలు కావాలనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్స్ రెండు మూడు చుక్కలు వేయండి ఇప్పుడు దళసరిగా ఉన్న ప్లాస్టిక్ కాగితాన్ని తీసుకొని రౌండ్ షేప్‌లో కత్తిరించుకోవాలి. దానికి సరిపడా చిన్నరంధ్రం చేసి దాని మధ్యలోంచి ఒత్తిని లాగాలి. అప్పుడు ఈ ఒత్తి నీటిలో తేలుతుంది. ఇప్పుడు దీపాన్ని వెలిగించండి. మరి ఈ వాటర్ క్యాండిల్స్ ప్రత్యేకత ఏమిటనేగా ప్రశ్న! మాములు దీపాల కంటే ఎక్కువ సేపు వెలుగుతాయి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళికి వాటర్ క్యాండిల్స్‌ని వెలిగించండి. నీటిలో వెలిగించిన దీపాల చిత్రాలను చూడండి!