తెలంగాణ

telangana

ETV Bharat / state

Diwali celebrations in Telangana: ఘనంగా దీపావళి వేడుకలు.. గల్లీగల్లీలో టపాసుల మోతలు..

రాష్ట్రంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా టపాసుల మోత, వెలుగులే కనిపిస్తున్నాయి. కరోనాతో గతేడాది అంతంతమాత్రంగా జరిగిన వేడుకలు ఈ సారి నింగిని తాకుతున్నాయి. హైదరాబాద్​లో బాణాసంచా కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. చిన్నారులు కేరింతలు కొడుతూ మతాబులు కాల్చుతున్నారు.

diwali celebrations in hyderabad
తెలంగాణలో దీపావళి సంబురాలు

By

Published : Nov 4, 2021, 8:03 PM IST

Updated : Nov 4, 2021, 9:03 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఉదయం పూజలు, నోములతో బిజీగా ఉన్న మహిళలు.. పొద్దు పొడవగానే ఇంటి చుట్టూ దీపపు ప్రమిదలతో అలంకరించారు. ఇష్టమైన పిండి వంటలు ఆరగిస్తూ మధ్యాహ్నం అంతా సందడిగా గడిపిన చిన్నాపెద్ద.. సాయంత్రం కాగానే బాణాసంచాను కాల్చేందుకు సిద్ధమయ్యారు. వీధులు, కాలనీలు కోలాహలంగా మారాయి. చిన్నారులు కాకరవ్వొత్తులు కాల్చూతూ సందడి చేస్తున్నారు. ఇళ్లన్నీ విద్యుద్దీపాల కాంతులతో, మట్టి ప్రమిదల వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.

రంగవల్లుల్లో హ్యాపీ దివాళి

వెలుగుల'బాద్​'

హైదరాబాద్ మహానగరంలో దీపావళి సందడి అంతా ఇంతా కాదు. ఏ గల్లీలో చూసినా మతాబుల మోతే. ఏ వీధికెళ్లినా నింగిని తాకే తారాజువ్వలే కనిపిస్తాయి. ఒకవైపు కరోనా భయం మరోవైపు ఈ ఏడాదైనా పండుగను బాగా జరుపుకోవాలనే ఉత్సాహం జనాల్లో కనిపిస్తోంది. పండుగ రోజున పిల్లలను ఉత్సాహపరుస్తున్నారు. దీపాల వెలుగులతో భాగ్యనగరం వెలుగులీనుతోంది. కుటుంబసభ్యులతో కలిసి బాణాసంచా కాల్చుతూ సంతోషంగా వేడుకలు చేసుకుంటున్నారు. కొవిడ్​ నిబంధనలతో గతేడాది పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఉత్సాహంగా వేడుకలు జరుగుతున్నాయి. టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.

మగువ చేతితో ముచ్చటగా దీపాలంకరణ

ప్రముఖుల ఇంట..

  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసం వద్ద బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన టపాసులు కాల్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో ఉత్సాహంగా టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
    మంత్రి మల్లారెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు
  • విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బంజారాహిల్స్​లోని మంత్రుల నివాస ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు ఆయన టపాసులు కాల్చి దీపావళిని వేడుకగా చేసుకున్నారు.
    వేడుకల్లో మంత్రి జగదీష్​రెడ్డి
  • రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. హనుమకొండలోని ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. టపాసులు పేల్చారు. ప్ర‌జ‌లంద‌రు పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని.. ట‌పాసులు కాల్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని మంత్రి సూచించారు.
    దీపావళి సంబురాల్లో కుటుంబంతో మంత్రి ఎర్రబెల్లి
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సంబురాల్లో పాల్గొన్నారు. ఇంట్లో నిర్వహించిన లక్ష్మీ పూజలో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా టపాకాయలు కాలుస్తూ.. దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అందరూ టపాసులు కాల్చేటపుడు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.
    దీపావళి వేడుకల్లో మంత్రి ప్రశాంత్​రెడ్డి కుటుంబం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ.. తన స్వగ్రామంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి బాణాసంచా కల్చారు. టపాసులు కాల్చే సమయంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
    టపాసులు కాల్చుతున్న ఎమ్మెల్యే హరిప్రియ

జిల్లాల్లో విరజిమ్మిన వెలుగులు..

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. పండుగ సంబురాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీపకాంతులతో లోగిళ్లన్నీ దేదీప్యమానమయ్యాయి. పిల్లలూ పెద్దలు పోటీ పడి మరీ బాణసంచా కాల్చి.. పండుగ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. వెలుతురు పూలు విరజిమ్మే చిచ్చుబుడ్లను, చిటపడలాడుతూ మెరిసే కాకరపువ్వొత్తులు, ఆకాశానికి దూసుకెళ్లి వెలుగులు పంచే తారాజువ్వలు, భూచక్రాలు.. ఇలా రకరకాల మతాబులు కాల్చి సందడి చేశారు.

హైదరాబాద్​లో దీపావళి సంబురాలు

ఇదీ చదవండి:Chinna Jeeyar Swami: అందుకే రామానుజ సహస్రాబ్ది వేడుకలు.. మోదీ తప్పక వస్తారు

Last Updated : Nov 4, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details