తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్య హత్యకేసులో మలుపు... మరోసారి విచారిస్తున్న పోలీసులు - విశాఖలో దివ్య హత్య కలకలం - పూర్వాపరాలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసును... పోలీసులు మరోసారి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రిమాండ్​లో ఉన్న దివ్య భర్త వీరబాబు, బాబాయ్ కృష్ణలను తిరిగి కస్టడీలోకి తీసుకొని... నాలుగో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.

divya murder case updates in vishakapattanam from Andhra Pradesh
దివ్య హత్యకేసులో మరోసారి విచారణ

By

Published : Jun 24, 2020, 7:28 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో ఈ నెల 3న జరిగిన దారుణ హత్య... రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనేక కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మరోమారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రిమాండ్​లో ఉన్న దివ్య భర్త వీరబాబు, బాబాయ్ కృష్ణలను తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారించారు. అనైతిక వ్యాపారంలో దివ్యకు వచ్చిన నగదు... వీరి మధ్య బదిలీ జరగడంతో మరోమారు వీరిని విచారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన దివ్య హత్యకు గురయ్యింది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details