తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం - jalamandali

కృష్ణా ఫేస్-2 1400ఎంఎం మెయిన్ రింగ్ -1 పైపులైనుకు అధికారులు జంక్షన్ ప‌నులు చేప‌డుతున్నారు. అందువల్ల నగరంలో సెప్టంబర్​ 2న పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.

disturbance in drinking water supply on 2nd september in hyderabad
హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం

By

Published : Aug 30, 2020, 6:23 PM IST

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేస్-2 1400ఎంఎం మెయిన్ రింగ్ -1 పైపులైనుకు జంక్షన్ ప‌నులు చేప‌డుతున్న కార‌ణంగా సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6గంటల వరకు ఈ మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ 24 గంటలు ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

మెహదీపట్నం, కార్వాన్, లంగర్​హౌస్, కాకతీయ నగర్, హుమాయన్ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్ నగర్, ఎంఈఎస్, షేక్‌పేట్, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్ నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్ హిల్స్​, సచివాలయం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్​, అల్లాబండ, గగన్ మహల్, హిమాయత్ నగర్, బుద్వేల్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడి, అత్తాపూర్, చింతల్‌మెట్, కిషన్‌బాగ్, మణికొండ, గంధంగూడ, నార్సింగి, కిస్మత్ పూర్ ప్రాంతాలలో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: యాదాద్రి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details