తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయంను రైతు పండగలా చేసుకోవాలి: అకున్​సబర్వాల్ - akun sabharwal

రాబోయే రోజుల్లో పెరిగే సాగు దిగుబడిపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ధాన్యం కొనుగోలు, సేకరణలో జాగ్రత్తలపై ఆ శాఖ కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పౌరసరఫరాల అధికారులతో అకున్​సబర్వాల్ భేటీ

By

Published : Feb 4, 2019, 7:49 PM IST

పౌరసరఫరాల అధికారులతో అకున్​సబర్వాల్ భేటీ
హైదరాబాద్​ ఎంసీఆర్‌హెచ్‌ఆర్​లో జిల్లా అధికారులకు శిక్షణ తరగతులను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ఏసీఎస్‌ఓ, జిల్లా మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, కేంద్ర కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఇప్పట్నుంచే ముందస్తు ప్రణాళికలు, సన్నద్ధంపై చర్చించారు. గత ఏడాది 54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా... ఈ సంవత్సరం ఒక ఖరీఫ్‌లోనే ఏకంగా 40 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది.

ABOUT THE AUTHOR

...view details