కొవిడ్ మహమ్మారి తీవ్రరూపం దాల్చిందని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రంగానగర్ పహాడి మసీదులో ముస్లింలకు రంజాన్ కిట్లు అందించారు. ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ - రంజాన్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠాగోపాల్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 నియమాలు పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ ఉత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ రంగానగర్ పహాడి మసీదులో రంజాన్ కిట్లు పంపిణీ చేశారు.
distribution of Ramzan kit bags
కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు వై.శ్రీనివాస్, రహీం భాయ్, మక్బూల్, జునైథ్ బాగ్దాది, మున్వర్ చాథ్, హనుమాన్ ఆలయ ఛైర్మన్ వల్ల శ్యామ్ యాదవ్, జావిద్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. ప్రైవేటు ల్యాబ్‌ల్లో నిలువు దోపిడీ