తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ రక్షణ కిట్లు పంపిణీ... - sanitation workers latest News

ముషీరాబాద్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందజేశారు. సమాజం నుంచి కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోందన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ రక్షణ కిట్లు పంపిణీ...
పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ రక్షణ కిట్లు పంపిణీ...

By

Published : Aug 6, 2020, 2:28 PM IST

హైదరాబాద్​లోని ముషీరాబాద్, జవహర్​నగర్ కమిటీ హాల్​లో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ వ్యక్తిగత రక్షణ కిట్లను అందజేశారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ప్రభుత్వం అందజేస్తున్న వ్యక్తిగత రక్షణ కిట్లను అనునిత్యం ధరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.

ప్రయత్నాలు ముమ్మరం...

సమాజం నుంచి కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోందన్నారు. కొవిడ్ నివారణ చర్యలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో లక్ష్మీగణపతి దేవస్థానం ఛైర్మన్ ముచ్చ కుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'శాంతిభద్రతల స్థాపనలో ఐపీఎస్​ల పాత్ర కీలకం'

ABOUT THE AUTHOR

...view details