తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​లో వైద్యులకు పీపీఈ కిట్ల పంపిణీ

సికింద్రాబాద్ చిలకలగూడలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి గ్లోబల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వైద్యులకు పీపీఈ కిట్లను అందజేశారు.

వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన పద్మారావు గౌడ్
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన పద్మారావు గౌడ్

By

Published : Apr 20, 2020, 5:25 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో వైద్యులు కూడా రక్షణ పాటించాలని నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్లోబల్ డాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ సోహైల్ ఖాన్ అన్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి గ్లోబల్ డాక్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వైద్యులకు పీపీఈ కిట్లను అందజేశారు. దాదాపు 20 మంది సిబ్బందికి కిట్లను అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో వైద్యులు తమకు రక్షణ కవచాలుగా పీపీఈ కిట్లను ధరించి రోగులకు చికిత్స అందించాలని సంస్థ చైర్మన్ సోహైల్ ఖాన్ కోరారు. వైద్య బృందానికి పీపీఈ కిట్లు అందించడం పట్ల వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. వైద్యులు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని... వారికి రక్షణగా ఉండేందుకు ఈ కిట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి : 'కేరళను కేంద్రం తప్పుగా అర్థం చేసుకుంది'

ABOUT THE AUTHOR

...view details