డీఆర్సీ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. 150 డివిజన్ల జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 30 డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు అందించడం, స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎల్బీనగర్ జోన్‌లో 5, చార్మినార్ జోన్‌లో 6, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి జోన్‌లో ఐదేసి, శేరిలింగంపల్లి జోన్‌లో నాలుగు డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
డీఆర్సీ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ - Ghmc drc centers
డీఆర్సీ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. 150 డివిజన్ల జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 30 డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు అందించడం, స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాలు నిర్వహించనున్నారు.
డీఆర్సీ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ
అక్కడి నుంచి సంబంధిత డివిజన్‌లకు సంబంధించిన సామగ్రి అధికారులకు పంపిణీ చేస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా కరోనా కిట్లతో పాటు 500 మిల్లీలీటర్ల శానిటైజర్లు సహా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున అందించేందుకు 60 వేల శానిటైజర్లను ఇప్పటికే బల్దియా సిద్ధం చేసింది. డీఆర్సీ కేంద్రం వద్ద ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు.