హైదరాబాద్లో శాంతిగిరి ఆశ్రమం, ఎన్ఎండీసీ సంయుక్తంగా పదివేల ఔషధ మొక్కల పంపిణీ చేపట్టాయి. ఎన్ఎండీసీ ఛైర్మన్, డైరెక్టర్ సుమిత్, స్వామీజీ ప్రాణవసుదన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులకు ఔషధ మొక్కలతో పాటు సేంద్రియ ఎరువులను అందించారు.
ఎన్ఎండీసీ కార్యాలయంలో ఔషధ మొక్కల పంపిణీ - telangana latest news
ఎన్ఎండీసీ కార్యాలయంలో ఔషధ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ సుమిత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతిగిరి ఆశ్రమ స్వామీజీ ప్రాణవసుదన్ పాల్గొన్నారు.
ఎన్ఎండీసీ కార్యాలయంలో ఔషధ మొక్కల పంపిణీ
ఇదో మంచి కార్యమని.. అందులోనూ చిన్నారులను భాగస్వామ్యం చేయడం సంతోషకరమైన విషయమని సుమిత్ అన్నారు. ఔషధ మొక్కల గొప్పతనాన్ని నలుదిక్కుల చాటిచెబుతున్న శాంతిగిరి ఆశ్రమానికి ధన్యవాదాలు తెలిపారు.