హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధి హిమాయత్ నగర్లో వలస కూలీలకు బియ్యం, పప్పు, కూరగాయలను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అందించారు. కాంగ్రెస్ యువ నేత అనిష్ గంగపుత్ర ఆధ్వర్యంలో బీహార్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ వలస కార్మికులకు సరకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు... నగర వ్యాప్తంగా నిరుపేదలకు తమ వంతుగా సాయం అందిస్తున్నట్లు అనిష్ తెలిపారు. ప్రజలు అకారణంగా బయటకు రాకుండా.. లాక్ డౌన్‌కు పూర్తిగా సహకరించాలని శ్రవణ్ కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తరఫున హిమాయత్ నగర్లో సరకుల పంపిణీ - DISTRIBUTION OF GROCERIES AND VEGETABLES FOR POOR BY CONGRESS PARTY
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు... కాంగ్రెస్ శ్రేణులు నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. పార్టీ యువ నేత అనిష్ గంగపుత్ర ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లో ఏఐసీసీ ప్రతినిధి శ్రవణ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

హిమాయత్ నగర్లో నిత్యావసర సరకుల పంపిణీ
హిమాయత్ నగర్లో నిత్యావసర సరకుల పంపిణీ