తెలంగాణ

telangana

ETV Bharat / state

బేగంపేట్​లో ముస్లింలకు పండ్లు పంపిణీ - BEGUMPET, HYDERABAD

హైదరాబాద్ బేగంపేటలో రంజాన్ మాసం ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లింలకు పండ్ల పంపిణీ చేశారు. స్థానిక తెరాస యువనేత నాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేద ముస్లింలకు కిరాణా సామగ్రిని అందించారు.

రంజాన్ సందర్భంగా ముస్లింలకు పండ్ల పంపిణీ
రంజాన్ సందర్భంగా ముస్లింలకు పండ్ల పంపిణీ

By

Published : May 1, 2020, 2:19 PM IST

బేగంపేట్ ప్రకాష్​నగర్​లో తెరాస యువజన విభాగం నేత నాని ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న వారికి పండ్ల పంపిణీ చేశారు. 20 మంది పేద ముస్లింలకు రంజాన్​ మాసాన్ని పురస్కరించుకుని పండ్లు అందజేయడం పట్ల సంతోషంగా ఉందని యువనేత నాని అన్నారు.

లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వలస కూలీలకు, పోలీసులకు అన్నదానాన్ని నిర్వహిస్తూ జ్యూస్​ను పంపిణీ సైతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రక్తదాన కార్యక్రమాన్ని కూడా చేశామన్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశం విముక్తి చెందాలని ముస్లిం సోదరులు అల్లాను ప్రార్ధించాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి : 'వుహాన్​ ల్యాబ్​ నుంచే కరోనా- ఆధారాలున్నాయ్!​'

ABOUT THE AUTHOR

...view details