మానవ సేవే మాధవ సేవ అని.. పేద ప్రజలకు సేవ చేయడమే పరమార్థమని కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్ అందె సుధాకర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలో సంస్థ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేదలకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు.
ఓల్డ్ బోయిన్పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ - latest news on Distribution of free mattresses at Old Boin Palli
ఓల్డ్ బోయిన్పల్లిలో కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అందె సుధాకర్ దుప్పట్లు పంపిణీ చేశారు.

ఓల్డ్ బోయిన్పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ
కొన్ని సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. తన వద్దకు వచ్చే పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలను ఆదుకునేందుకు పాటుపడతామన్నారు.
ఓల్డ్ బోయిన్పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ
ఇదీ చదవండి: దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్కు స్వర్ణం