లాక్డౌన్(Lock down) సమయంలో అనాథ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి వారికి సికింద్రాబాద్ తెరాస యువ నాయకుడు భువనేశ్వర్ రావు అండగా నిలుస్తున్నారు. కరోనా రెండో దశలో కేసులు పెరుగుతున్న తరుణంలో అనాథ పిల్లలకు తానున్నానంటూ భరోసా కల్పిస్తూ వారికి ఆహారాన్ని అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
Food distribution: అనాధ పిల్లలకు ఆహారం పంపిణీ - సికింద్రాబాద్ బన్సీలాల్ పేట
సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని హోమ్ ఫర్ డిసెబుల్డ్లో సికింద్రాబాద్ తెరాస యువ నాయకుడు భువనేశ్వర్ రావు తన సొంత నిధులతో అనాథ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కరోనా వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని హోమ్ ఫర్ డిసెబుల్డ్లో తన సొంత నిధులతో అనాథ పిల్లలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. దాదాపు 250 మంది పిల్లలకు ఆయన ఆహారాన్ని అందించారు. కరోనా కష్టకాలంలో వారి పరిస్థితిని చూసి తన వంతు సాయంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్(Lock down)కు సహకరించాలని తెరాస నేత భువనేశ్వర్ రావు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:corona : కరోనాతో నాన్న.. ప్రసూతి కోసం వెళ్లి అమ్మ మృతి