తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా నిత్యావసర సరుకులు - Ktr Birthday Latest News

సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెడ్డి కాంపౌండ్​లో నిరు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను స్థానిక తెరాస నేత, ఆరో వార్డు మెంబర్ పాండు యాదవ్ పంపిణీ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సరుకులు అందించారు.

కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా నిత్యావసర సరుకులు
కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా నిత్యావసర సరుకులు

By

Published : Jul 24, 2020, 5:55 PM IST

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెడ్డి కాంపౌండ్​లో 30 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆరో వార్డు మెంబర్ పాండు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాల పంపిణీ చేసినట్లు పాండు యాదవ్ స్పష్టం చేశారు.

కఠోరంగా శ్రమిస్తున్నారు...

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కేటీఆర్ కఠోరంగా శ్రమిస్తున్నట్లు పాండు పేర్కొన్నారు. కేటీఆర్ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారని కొనియాడారు. భవిష్యత్​లో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మరిన్ని విజయాలు సాధించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'పీవీ బాటలో నడుస్తాం... 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం'

ABOUT THE AUTHOR

...view details