సికింద్రాబాద్ పరిధిలోని లాలపేట్ ఎస్ఎఫ్ఎస్ చర్చిలో క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఉపసభాపతి టి.పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని కానుకలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారికి ప్రాముఖ్యతను కల్పిస్తుందన్నారు. అధికారికంగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందన్నారు.
క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన పద్మారావు గౌడ్ - క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఉపసభాపతి టీ. పద్మారావు గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఉపసభాపతి తీగల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాలాపేట్ ఎస్ఎఫ్ఎస్ చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు.

క్రిస్మస్ కానుకల పంపిణీ చేసిన పద్మారావు గౌడ్
క్రైస్తవులకు క్రిస్మస్ పండుగకు దుస్తులు అందించడం, చర్చిల నిర్వహణకు రూ. లక్ష మేరకు నిధులను సమకురుస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ విందుకు సికింద్రాబాద్ పరిధిలోని చర్చి నిర్వహకులు, ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, చర్చి పాస్టర్, తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ కానుకల పంపిణీ చేసిన పద్మారావు గౌడ్
ఇదీ చూడండి : పగలంతా పబ్జీ.. రాత్రేమో డేటింగ్ యాపుల్లో..