అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను సికింద్రాబాద్లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ తెగల విభాగం ఆధ్వర్యంలో స్థానిక మదర్ థెరిసా విగ్రహం వద్ద పేదలకు దుప్పట్లు పంచి పెట్టారు.
రాహుల్ పుట్టినరోజు... సికింద్రాబాద్లో పేదలకు దుప్పట్లు - Rahul gandhi birthday celebrations secunderabad
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ మదర్ థెరిసా విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశాయి. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్ షెడ్యూల్ తెగల విభాగం కార్యదర్శి మహేశ్ తెలిపారు.
పేదలకు దుప్పట్ల పంపిణీ
కరోనా ఆపత్కాలంలో పేదలకు దుప్పట్లతో పాటు మాస్కులను సైతం అందజేసినట్లు కాంగ్రెస్ షెడ్యూల్ తెగల విభాగం కార్యదర్శి మహేశ్ తెలిపారు. తెలంగాణ సర్కారు కొవిడ్-19 టెస్టులు సరిగా చేయడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :బొమ్మను వివాహం చేసుకున్న యువకుడు.. కారణం ఇదే!