సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సమతా నగర్, ఎస్బీఐ కాలనీల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకు వీఎన్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ వల్లం మాస్కులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి నిర్బంధంలో ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పని చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.
సిబ్బంది, ప్రజలకు మాస్కులు పంపిణీ - secunderabad latest news today
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని వీఎన్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ వల్లం తెలిపారు. బోయిన్పల్లిలోని పలు కాలనీల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన మాస్కులను అందజేశారు.
సిబ్బంది, ప్రజలకు మాస్కులు పంపిణీ
ప్రతిరోజు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారని, వారి రక్షణ కోసమే మాస్కులను తయారుచేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ తరఫున పలువురు పేదలకు నిత్యావసరాలు అందజేసినట్లు చెప్పారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రజలకు రక్షణ మాస్కులను అందజేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త