భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవాడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. బాధితుల సహాయార్థం పలు మద్యం తయారీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 కోటి 25 లక్షల విరాళం అందించారు.
వరద బాధితులకు విరాళమిచ్చిన మద్యం తయారీ సంస్థలు - హైదరాబాద్ వార్తలు
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల సహాయార్థం పలు మద్యం తయారీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి 25లక్షలు ప్రభుత్వానికి విరాళమిచ్చారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు డిస్టలరీల యజమానులు కోటి రూపాయల చెక్కు, రూ.25 లక్షల నగదు అందించారు.
హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కలిసి డిస్టలరీల యజమానులు, కింగ్ఫిషర్ కంపెనీ, ఆఫీసర్స్ ఛాయిస్, బ్లండర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కోటి రూపాయలు చెక్కును, రూ.25లక్షలు రూపాయల చెక్కును విడివిడిగా అందచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని... వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సహాయం అందచేసినట్లు తెలంగాణ రాష్ట్ర డిస్టలరీల అసోసియేషన్ అధ్యక్షుడు మన్నవ కామేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లెండర్స్ కంపెనీ ఛైర్మన్ కిషోర్ ఆర్. ఛాబ్రియా, ఇతర కంపెనీల అధిపతులు ఉన్నారు.
ఇదీ చదవండిఃకరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్!