తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా కార్యాలయంలో అసమ్మతి నేతల ధర్నా - గోషామహాల్‌-గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండు యాదవ్‌

భాజపా రాష్ట్ర కార్యాలయంలో అసమ్మతి నేతలు ధర్నా చేశారు. మంగళవారం భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉమామహేందర్‌ పేరు లేదంటూ ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు.

dissent-leaders-protest-at-the-bjp-state-office-hyderabad
భాజపా కార్యాలయంలో అసమ్మతి నేతల ధర్నా

By

Published : Sep 23, 2020, 5:45 PM IST

భాజపా రాష్ట్ర కార్యాలయంలో అసమ్మతి నేతలు ధర్నా నిర్వహించారు. మంగళవారం భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉమామహేందర్‌ పేరు లేదంటూ ఆయన అనుచరులు ధర్నాకు దిగారు.

భాజపా కార్యాలయంలో అసమ్మతి నేతల ధర్నా

గోషామహాల్‌-గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా పాండు యాదవ్‌ను పార్టీ ప్రకటించింది. పాండు యాదవ్‌ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు అక్కడకు చేరుకుని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

ఇదీ చూడండి :దారిలేక వాగు దాటేందుకు 2 గంటలు నరకయాతన పడ్డ గర్భిణి

ABOUT THE AUTHOR

...view details