తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లిలో వివాదం... ఇరువర్గాల మధ్య ఘర్షణ - నరసరావుపేట వార్తలు

పెళ్లిలో వివాదం... ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. వివాహ మండపం వద్దే ఇరువర్గాలు గొడవకు దిగాయి.

పెళ్లిలో వివాదం...ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెళ్లిలో వివాదం...ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Jan 8, 2021, 2:16 PM IST

ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ పెళ్లిలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పట్టణ శివారులోని ఇసప్పాలెంలో గురువారం రాత్రి జరిగిన వివాహానికి రెండు ప్రాంతాల వారు హాజరయ్యారు. వారి మధ్య వివాదం తలెత్తింది. వివాహ మండపం వద్దే ఇరువర్గాలు గొడవకు దిగాయి.

పెళ్లి అయిపోయిన తర్వాత గొడవకు కారణమైన ఒక వ్యక్తిని వేరే వర్గం వారు కోడెల స్టేడియం వద్ద అటకాయించారు. కారులోని ఉన్న వ్యక్తిని బయటకు లాగి దాడి చేశారు. అనంతరం ఇరువర్గాలు నరసరావుపేట గ్రామీణ, రెండో పట్టణ పోలీసు స్టేషన్లలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

పెళ్లిలో వివాదం...ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు

ABOUT THE AUTHOR

...view details